Monday, December 11, 2017

                                                             మూసుకున్న తలుపులు
        సాధారణంగా నలుగురు డాక్టర్లు సాయంత్రాలు కలిసికబుర్లు చెప్పుకోవడానికి కుదరదుఆస్పత్రికివెళ్లడం,సొంత క్లినిక్కు చూసుకోవడమో ,మీటింగో ఏదోఅడ్డంకి వస్తూనే వుంటుంది . అరుదుగా దొరికే  అవకాశందొరికిన వొక  సాయంత్రం ..... నేనూసర్జనుసోమయాజులూ,కార్డియాలజిస్టు గోపాలూసీఎంఓరాజుగారు మా యింట్లోనే  బ్రిడ్జి ప్రోగ్రామ్ పెట్టుకున్నాం.ఆఖరి నిమిషంలో రాజుగారు రాలేనని ఫోను చేశారుసరే  ఎలాగూ ,బ్రిడ్జ్ ప్రోగ్రామ్ లేదుముగ్గురం కలిశాం,పిచ్చ్చాపాటీ మొదలయిందిముగ్గురు డాక్టర్లు కలిస్తేమాట్లాడడానికి కబుర్లు హాస్పిటలు,జబ్బులు,పేషంట్లేను.యెంత వద్దనుకున్నా టాపిక్కు ఆటే వెళ్లి పోతుంది
                                   అవేళ పొద్దున్నవక డెబ్బై ఏళ్ళముసలాయనికి  ఫ్రాక్శ్చర్ ఫిమర్ కేసుకి నేనే ఎనస్థీషియాయివ్వడం జరిగిందిహాస్పిటలు మేట్రనుబంధువుట,ఆవిడ రికమండేషనుపిఎసి కూడా నేనేచేశాను.ఆర్త్రైటీసు ,బీపీ,డైబటీసు,హార్టులో ఇస్కీమిక్ఛేంజెస్ఉండవలసిన అన్ని అవలక్షణాలూ వున్నాయ్.వీటికి సాయం బ్రహ్మాండమైన చెవుడువెరీహైరిస్కు కాంసెంట్ తీసుకుని కేసుకి ఫిట్నెస్ ఇచ్ఛేసాను . అది ఇవ్వాళ  ఆర్థో సర్జెరీకి  పోష్టు చేశారుసర్జెరీ ఏదైనాఎనస్తీసియా,దాని రిస్కుప్రొబ్లెమ్స్ తప్పనేను వుకదా .... టాగూరు మంచి సర్జనే కానీ చాదస్తం ఎచ్చు .ఒకటికిరెండుసార్లు కంఫర్మ్ చేసుకుంటాడు.మంచి పద్ధతే కానీమాకు యెంతట కేసు పూర్తి చేసుకుని పేషంటుని సాఫిగాబయటికి పంపిచేద్దామా అని వుంటుందిజూనియర్లుకియివ్వకుండా నేనే ఎపిడ్యూరల్ కాథెటర్వేసిఎపిడ్యూరల్ యిచ్చి,సెడేషను ఇచ్చేసి సర్జనుకిథంబ్సప్ యిచ్చేసాను.మొత్తమ్మీద కేసు బాగానేఅయింది కేసు గురించి నా మిత్రులకిచెబుతూ,"జీరియాట్రిక్ పేషంట్లు గొప్ప ప్రోబ్లెం గురూ.సుగర్లు,బీపీలు,హార్ట్  ప్రొబ్లెమ్స్,దగ్గు,ఆయాసం,చెవుడు.వాళ్ళ మాటటుంచి మన ప్రాణాలు పిడికిట్లో పెట్టుకునిపని చేయాలి ఏళ్ల తరబడి అదే పని చేస్తూ వున్నా టెన్షను తప్పదు"అంటూ అవేళ విషయం ప్రస్తావించాను..
                                       సోమయాజులు కూడా నాతొఏకీభవించాడు.ఫీమరు ఫ్రాక్చరు కనుక ఎపిడ్యూరల్యిచ్చి మేనేజ్ చేసావ్మా కేసులయితే జనరల్తప్పదుకదా,అందుకు సంతోషించావోయ్ శ్రీనివాసూ"అన్నాడుఅదీ నిజమే కానీ దేనిమంచి చెడ్డలు దానికివున్నాయ్
                                      గోపాల్  అప్పటిదాకా యేవీమాట్లాడకుండా వింటున్నవాడు  "శ్రీనూనీ కేసు విన్నాకనా అనుభవం ఒకటి చెప్పాలనిపిస్తోంది "  అన్నాడు
"చెప్పు మరి".నేనూ,సోమయాజులూ ఒకే సారి అన్నాం
                                      "ఒక్క నిమిషంఆగు.కాఫీ,మంచింగూ తెస్తాను "అని లోపల నా భార్యచేస్తున్న పకోడీలు పట్టుకొచ్చాను
 "ఇక చెప్పు నీ కహానీ"
                      "మన హాస్పటల్ లోనే నెల్లాళ్లక్రితంగుండెల్లో నెప్పితో ఒకాయన,పెద్దాయనేఅడ్మిట్అయ్యాడు.పేరు మాధవరావు,గవర్నమెంటులో చీఫ్ఇంజినీరుగా రిటైర్ అయ్యారట.కేజుయాలిటీ లో మాఅసిస్టెంటు ప్రియా చూసి,ఈసీజీ డయాగ్నోసిస్ ఎక్యూట్ఎమ్. అని  సి యూ లో అడ్మిట్ చేసి నాకు ఇంఫామ్చేసిందినేను వెంటనే వెళ్లి చూసే సరికి స్టెబిలైజయ్అయ్యాడు.సరే రొటీన్ టెస్టులన్నీ చేయించమని చెప్పివచ్చేశానుబీపీ పేషంటుట,దాని కవల సోదరుడుడైబటీసు కూడామందులతో కంట్రోల్లోనే వుందివయసుడెబ్భై పైనే వుంటుందిఆస్పత్రికి కొడుకు,కోడలూతీసుకొచ్చారు".
                        ఇంతలో మా ఆవిడ మరికొంచెంపకోడీలూ,కాఫీ పట్టుకొచ్చింది
                         " కంటిన్యూ చెయ్ బాసూఅన్నాడుసోమయాజులు
                                  "నాలుగు రోజులకి బాగా కోలుకున్నాడుఐదో రోజు రౌండ్స్ కి వెళ్ళేప్పటికీ రౌండ్స్ కి వెళ్ళేప్పటికిఒక కొత్తమ్మాయి ,కొడుకూ పెద్దాయన మంచానికి రెండుపక్కలా నుంచుని వాదులాడుకుంటున్నారునేనుకొంచెం దూరంలో నిలబడి గమనిస్తున్నాను,విషయంఏవిటా అని". 
                       "ఇదంతా నీ వల్లేఎప్పుడైనా వచ్చినాన్నగారేలా వున్నారో చూసేవా,కనుక్కున్నావానీ మీదబెంగతోనే ప్రాణం మీదకి తెచ్చుకున్నారు"అంటున్నాడుకొడుకు
                        "అన్నయ్యా ,ఆమాటంటే నేనొప్పుకోను.నాన్నగారిని నువ్వే తిన్నగా చూసుకోలేదుఆయనపెన్షను,ఆస్తికోసమే నువ్వూ,వదినె మీ దగ్గరపెట్టుకున్నారుఅయన పెన్షను డబ్బులు అనుభవిస్తూయిప్పుడు హాస్పటలు బిల్లు నన్ను కట్టమంటావా?ఇంటిఆడపడుచునని కూడా జ్ఞానం లేదా?"
                        "ఓహోహో... లక్షలు కట్నంపుచ్చుకొని,పెళ్లి అయింతర్వాత తండ్రిని చూడ్డానికైనారాని కూతురు,ఆడపడుచుట,ఆడపడుచుఅమ్మ ఎలాగూలేదునాన్న ఒక్కరూ ఎలా వున్నారో  యెప్పుడైనాకనుక్కున్నావా,వచ్చావా?పండగలకి రావడం,పండగకట్నాలు తీసుకోవడం తప్ప యిన్ని ఏళ్లలో మామ్మూలుగాఎప్పుడొచ్చావు?"
                       "నాకదంతా తెలియదన్నయ్యా.నాకూపిల్లలు కాలేజీ చదువులకొచ్చారువాళ్ళఫీజులూ,పుస్తకాలూ,డ్రెస్సులూ..... బోలెడన్నిఖర్చులు.ఇప్పుడు హాస్పటల్లో బిల్లు కట్టడానికి లక్ష,రెండులక్షలంటే నేనెక్కడనుండి తెస్తాను?నా తండ్రి మందులఖర్చూ,ఆసుపత్రి బిల్లూ అంటూ మా ఆయన్ని అడగడంనావల్ల కాదు,నాకిష్టం కూడా లేదు". టిపికల్ మధ్య తరగతిసమస్యలు....
                         " నా రాక తెలియడం కోసంచిన్నగాదగ్గి , పెద్దాయన బెడ్డు దగ్గరకు వెళ్లి,పలకరింపుగానవ్వానునన్ను చూసి అన్నాచెల్లెళ్లు వాదనలువిరమించి సైలెంటయిపోయారుమాధవరావుగారుచిరునవ్వుతో నా రెండు చేతులూ అభిమానంగాపట్టుకున్నారు. " 
                         " మీరు డాక్టరుగారయినా వయసులో నాకొడుకువంటివారుమొన్న రాత్రి ఛాతీలో కొంచెంనొప్పిలా అనిపించిందిమావాడితో చెబితేగాభరాపడిపోయి ఇక్కడకు తీసుకువచ్చి మీ అందరికీయిబ్బంది కలిగించేశాడుపాపం చాలాబెంగపడిపోయాడు,నేనంటే నా పిల్లలిద్దరికీ చాలాప్రేమ.దీన్ని చూడండి (కూతురుని చూపిస్తూ)నాకిలావంట్లో బావులేదని వెంటనే హైదెరాబాదునుండిఫ్లయిటులో వచ్చేసిందికోడలికి యింటి పని,ఆఫీసుపనితోటే సరిపోతుందిఇప్పుడు నొప్పీ అవీ యేమీలేవు.బాగాసుళువుగావుంది.నాకు కొంచెం చెముడు.మీరుచెప్పేవి వినిపించవు,అర్ధం అవ్వవు.ఏవైనాఎడ్వైజులుంటే దయచేసి మావాడికి చెప్పండిఈమధ్యేకేటరాక్టు కూడా డెవలప్ అయింది.ఏవీ స్పష్టంగాకనిపించవు.మీరు నన్ను చాలా బాగా చూసుకున్నారు.మీకు రుణపడిపోయాను"అంటూ కళ్ళ నీళ్లుపెట్టుకున్నారు
                         "అప్పుడు నాకు బల్బువెలిగింది,మాధవరావుగారికి బ్రహ్మచెముడని.... కూతురూకొడుకూ వాదనలు ఒఖ్ఖముక్క కూడా ఆయనకీవినిపించలేదనీ,మందగించిన చూపువల్ల పిల్లలహావభావాలు కూడా గ్రహించలేక పోయారని అర్ధమైంది"
                          "భగవంతుడు కూడా మనిషికి మేలుచేసేఏర్పాట్లు ఎక్కడికక్కడ చేసి ఉంచుతాడని అప్పుడు నాకుతెలిసిందివృద్ధాప్యంలో చూపు  తగ్గడం,వినిపించకపోవడం,జ్ఞాపకశక్తి తగ్గిపోవడం ,యివన్నీ వయసుమళ్లినవాళ్ళకి వరాలే.పిల్లలు,పెళ్ళాం ,యింకెవరైనాఏమన్నా వినిపించాడు,వినిపించినా అర్ధంఅవదు,జ్ఞాపకం వుండదువాళ్ళ ప్రపంచమే వేరు.గాంధీ గారి కోతుల్లాగ చేదు వినలేరు,చూడలేరు.అదృష్టవంతులు.... వారి జీవితాలుమూసుకుపోతున్న తలుపులు "  అంటూ ముగించాడుగోపాల్
Undurthy Srinivas