Wednesday, March 29, 2017


నా (ఊసుపోని ) కవితలు
                               ఉణుదుర్తి శ్రీనివాస్ 


1) మోడీ మంత్రం విదేశీ యాత్రం  దేశంలోమాత్రం                                     మౌనవ్రతం



2) ప్రత్యెక హోదాలిచ్చేసి,పాకేజీలు ప్రకంటిచేసి
    వోట్లడగడం ,నోటుకి వోటు కాదా  
     లేక మోడీ మంత్రమా, మాయాజాలమా 
     ఓప్రధానమంత్రీ ?!



3) చీపుళ్ళుపట్టి చేతన్   
    ఫోటోలు దిగి ముగించేన్ 
    వేషముల కార్యక్రమం
  ప్రతీపోలిటిషియన్  
   జై స్వఛ్చ భారత్ మిషన్


4) యిద్దరు చంద్రుల మధ్య యిమడలేక నరసింహన్  బిగించి గట్టిగా పంచెన్                సతీసమేతంగా అర్జెంటుగా పరుగెత్తెన్ శ్రీనివాసుని సేవకున్.


5) సుమిత్రామహాజన్  హాజరుపట్టీ తీసెన్ ప్రధానమంత్రియే కానరాకుండెన్                  విమానంలో వెళ్లేనట బహ్రయిన్.

                                                              

6) తెల్లస్కిన్ను బ్రైటటా అందులోనూ ఇటలీ వాళ్ళది బెష్టుటా  యిది కాంగ్రెసు వాళ్ళ మాటటా ఇండియా పాలిట గ్రహపాటటా!.


7) రాహుల్ గాంధీ గీయడెపుడూ గెడ్డం  తెలియని వాగుడుతో పడతాడు కాళ్లకడ్డం           వెల్లులోకెళ్ళినా, సీటులో బబ్బున్నాఅమ్మవుంటుందిగా సాయం.

 
8) లోక్ సభలో,రాజ్యసభలో రచ్చ చూసి  నామీద నాకే అసహ్యం వేసి టీవీ కట్టేసి         పడుకున్నాను ముసుగేట్టేసి.
                                                                                                                                        

9) కుంభకోణం యెక్కడుందంటే బొగ్గులోన, గడ్డిలోన, గద్దెమీద మిద్దెమీదఎందెందు చూసినా అందందే కలదంటూ  ఇవ్వాల్టి పిల్లలు దేశపటాన్నే మర్చిపోయారు ,అకటా!!


10) ప్రతీవారం వెళతారు జడ్జీలు తిరుపతి కానీ పెరుగుతుందా వాళ్ళ పరపతి   తీర్పులన్నీ  దైవాధీనం ,మంగళ హారతి న్యాయదేవతా నీకిదే మా నమస్తుతి .

11) దిన పత్రిక తెరవగానే అమెజాన్ అడ్వెర్టైజుమెంట్ టీవీ వార్తల్లో కామసూత్ర  కండోమ్ కమ్మర్షియల్ లేపోతే రామదేవ్ బాబా పతంజలి ప్రమోషన్ వ్యాపారమా నీకు జోహార్. 
 
.
12).  ఆటల్లో ఆట వేలం పాట నల్ల ధనం వదిలించుకోడానికిదో మార్గమట                ఇందులో మాత్రం  క్రికెట్టుకే  వేయాలి  పెద్దపీట గేములు కూడా స్కాములయిపోయాయి అకటా


13)  ప్రజాస్వామ్యం వున్నంతకాలం  తప్పదు స్కాముల భాగోతం వేచి వుందాం అంత కాలం ప్చ్! తప్పుతుందా మరి అంతా కలికాలం .